
ఓ అంచనా ప్రకారం.. పిల్లలు పుట్టడం లేదని లోలోన కుమిలిపోతున్న జంటలు మనదేశంలో 2 కోట్ల 75 లక్షల మంది. 20 శాతం మంది దంపతులు ఒక్క నలుసు కోసం ఏళ్లుగా పరితపించిపోతున్నారు. అందులోనూ.. 50 శాతం సమస్య మగవారిలోనే. ఇక్కడ పట్టణమా, పల్లెటూరా అని తేడా లేదు. అఫ్‌కోర్స్… సిటీల్లో ఉండే మగవాళ్లలోనే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ కనిపిస్తున్నా.. అంతేస్థాయిలో పల్లెల్లో ఉన్న మగవారిలోనూ సమస్య ఉంది. ఇన్ని లెక్కలు ఓపెన్‌గా కనిపిస్తున్నప్పుడు.. ఇన్ని కోట్ల మంది పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు… ఆ దంపతుల ఆశను క్యాష్ చేసుకోవా ఈ ఐవీఎఫ్ సెంటర్లు. మా దగ్గరకు రండి.. చేతిలో బిడ్డను పట్టుకెళ్లండి అన్నంత ఈజీగా యాడ్స్ ఇచ్చి మరీ దోచుకుంటున్నాయి. అందుకే.. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇన్ని ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయ్. ఇండియాలో ఐవీఎఫ్ సెంటర్ల టర్నోవర్.. ఒక్క ఏడాదికి 12వేల 267 కోట్ల రూపాయలు. పిల్లలు పుట్టని వారి సంఖ్య పెరుగుతున్నట్టే.. ఈ ఐవీఎఫ్ సెంటర్ల ఆదాయం కూడా ఏటా 15 నుంచి 20 శాతం పెరుగుతోంది. 2034 నాటికి.. అంటే దాదాపుగా వచ్చే పదేళ్లలో ఈ ఐవీఎఫ్ మార్కెట్ 40వేల కోట్ల రూపాయల టర్నోవర్ దాటుతుందని ఓ అంచనా. భవిష్యత్తులో లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే వ్యాపారం ఇది. ‘పిల్లల్ని పుట్టిస్తాం, వాళ్లతో అమ్మనాన్న అనిపిస్తాం’ అని ఒక్క బోర్డ్ తగిలించుకుంటే చాలు.. లక్షలకు...