AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకేసిన మహిళ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మూఢనమ్మకాల ముసుగులో ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. దైవ చింతనలో సమయం గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే నేరుగా దేవుడి వద్దకు చేరుకోవచ్చని నమ్మిన సదరు మహిళ ఉన్నట్లు తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Hyderabad: 'దేవుడి దగ్గరికి వెళ్తున్నా..' ఐదో అంతస్తు నుంచి దూకేసిన మహిళ! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Woman Jumping Off From 5th Floor
Srilakshmi C
|

Updated on: Aug 03, 2025 | 6:56 AM

Share

హైదరాబాద్‌, జూన్ 25: మహిళలు రాకెట్‌లో అంతరిక్షం చేరి.. నెలల తరబడి ప్రయోగాలు జరుపుతున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా ఓ గృహిణి దేవుడి దగ్గరికి వెళ్తున్నాని చెప్పి భవనం అయిదో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని హిమాయత్‌నగర్‌ ఉర్దూ హాల్‌ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులో అరుణ్‌కుమార్‌ జైన్‌ అనే వ్యాపారికి 2002లో పూజా జైన్‌ (43)తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే గత ఐదేళ్లుగా పూజా మానసిక సమస్యతో బాధపడుతోంది. ఇందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు దైవ చింతన పెరిగింది. దీంతో రోజంతా ఆమె ఆధ్యాత్మికతలో గడపసాగింది.

ఈ క్రమంలో శనివారం (ఆగస్టు 3) ఉదయం ఆమె భర్త అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆఫీస్‌కి వెళ్లిపోయారు. కొడుకు, కూతురుతోపాటు పని మనిషి ఇంట్లో ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు పూజ గదిలో ఒంటరిగానే కూర్చున్న పూజా జైన్‌.. ఏం జరిగిందో తెలియదుగానీ ఒక్కసారిగా ఐదో అంతస్తుపై నుంచి కిందకు దూకేసింది. దీంతో తీవ్రగాయాల పాలైన పూజాను హుటాహుటీన హైదర్‌గూడలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఆత్మహత్యకు ముందు కూర్చున్న గదిలో పోలీసులకు ఓ ఉత్తరం కనిపించింది. దైవధ్యానంలో గడుపుతూ ఆత్మార్పణ చేసుకుంటే దేవుడికి వద్దకు చేరుకుంటామని, స్వర్గం ప్రాప్తిస్తుందని జైన గురువుల సూక్తి అందులో రాసి ఉన్నట్లు ఎస్సై నాగరాజు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.