AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక తేల్చేద్దాం రండి.. తెలంగాణలో సరికొత్త స్పోర్ట్స్ పాలసీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

1956లో జరిగిన ఒలంపిక్స్‌లో ఇండియాను మేటిగా నిలబెట్టిన నేషనల్ ఫుట్‌బాల్‌ టీమ్‌లో 9 మంది హైదరాబాద్‌వాళ్లే. 70 ఏళ్ల కిందటే మెరికల్లాంటి యువ క్రీడాకారుల్నిచ్చిన గడ్డ ఇప్పుడు మాత్రం ఎందుకు వెనకబడింది? మన యూత్‌లో స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ తగ్గిందా? తేల్చేద్దాం రండి అంటోంది తెలంగాణ సర్కార్.

Telangana: ఇక తేల్చేద్దాం రండి.. తెలంగాణలో సరికొత్త స్పోర్ట్స్ పాలసీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Aug 02, 2025 | 7:55 PM

Share

లెటజ్ స్టార్ట్‌ ది గేమ్ అంటోంది తెలంగాణలో రేవంత్ సర్కార్.. పాత క్రీడావిధానాన్ని సమూలంగా మార్చి.. సరికొత్త స్పోర్ట్స్ పాలసీతో దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ HICC వేదికగా జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఫస్ట్‌ ఎడిషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతన క్రీడా విధానం ఆవిష్కృతమైంది. ఒలింపిక్‌ పతకాలే మన పాలసీ లక్ష్యమని, ఆ విధంగా తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. యువత క్రీడామైదానాల్లో లేకపోవడంతో దేశం చాలా నష్టపోతోందన్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియమ్‌ను ప్రస్తావించారు.

ఉద్యమంలో ముందుభాగంలో నిలబడి పోరాడిన యువత.. గత ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం వల్ల వ్యసనాల బారిన పడిందని ప్రభుత్వం భావిస్తోంది. యువతీయువకుల్లోని బలమైన పోరాట స్పూర్తిని క్రీడల వైపు మళ్లించాలన్నది సర్కార్ ఆలోచన. క్రీడా విధానంలో రాజకీయాల జోక్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పబ్లిక్‌, ప్రైవేట్ ఉమ్మడి భాగస్వామ్యంతో కొత్త స్పోర్ట్స్ పాలసీని రూపొందించారు. కార్పొరేట్ కంపెనీల్లో సక్సెస్‌ స్టోరీ ఉన్నవాళ్లు, క్రీడల్లో రాణించి పతకాలు తెచ్చి దేశానికి గర్వకారణంగా నిలబడ్డవాళ్లు పాలసీలో కీలకంగా మారబోతున్నారు.

చదువుల్లోనే కాదు, క్రీడల్లో రాణించేవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, రవికాంత్, సిరాజుద్దీన్, నికత్ జరీన్ లాంటి స్పోర్ట్స్‌ స్టార్ల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. అన్ని రంగాల్లో ప్రపంచంతో పోటీపడుతున్నాం.. క్రీడల విషయంలో మాత్రం ఎందుకు బలహీనంగా ఉన్నాం.. అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. భారత్‌కు బలమైన క్రీడావేదిక కావాలి.. అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా