AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు!

Hyderabad IT Corridor Traffic Alert: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులకు కీలక అలర్ట్ జారీ అయింది. గచ్చిబౌలి–లింగంపల్లి ప్రధాన రహదారిపై వచ్చే ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మల్టీ లెవెల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు!
Hyderabad Traffic Alert
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 1:32 PM

Share

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, నానక్‌రామ్ గూడా మధ్య రాపోకలు సాగించే ప్రయాణికులకు ఇదో బిగ్‌ అలర్ట్. ఇకపై ఈ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్టు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద నిర్మాణ పనులు మొదలవడంతో, ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జంక్షన్ వైపు వచ్చే వాహనాలపై పరిమితులు విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, కొండాపూర్ వైపు వెళ్లే వాహనదారులపై ప్రభావం చూపనున్నాయి.

ఆఫీసు టైమ్స్‌లో ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గచ్చిబౌలి జంక్షన్‌లోకి నేరుగా వెళ్లకుండా, సమీపంలోని అంతర్గత రోడ్లను ఉపయోగించాలని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే రాడిసన్ హోటల్ పరిసరాలు, ప్రధాన కూడళ్ల వద్ద అదనపు ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు.

ఈ సమయంలో వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించడంతో పాటు, ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా అప్‌డేట్స్‌ను గమనించాలని అధికారులు కోరుతున్నారు. నిర్మాణ పనులు ఏడాది పాటు కొనసాగనున్నందున, ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ఈ భారీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పోలీసులు తెలిపారు. అప్పటివరకు ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణించాలని వాహనదారులను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే