‘ధరణి పోర్టల్ ప్రారంభం నుంచే అనేక లోపాలు..’ కమిటీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం మరో టర్న్ తీసుకుంది. పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ సహకరించకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది ధరణి కమిటీ. ఫాల్కన్ కంపెనీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారా లేక వాట్ నెక్ట్స్ అన్నది సస్పెన్స్‌గా మారింది.
రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం మరో టర్న్ తీసుకుంది. పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ సహకరించకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది ధరణి కమిటీ. ఫాల్కన్ కంపెనీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారా లేక వాట్ నెక్ట్స్ అన్నది సస్పెన్స్‌గా మారింది.
ధరణి పోర్టల్ డిజైన్ చేసిన ప్రైవేట్ కంపెనీ కమిటీకి సహకరించట్లేదా..? సమస్యలపై అధ్యయనానికి పిలిచినా ప్రైవేట్ కంపెనీ స్పందించలేదా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చకు కారణమైన ధరణి పోర్టల్ అంశం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తీసుకొస్తామని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే ధరణిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మూడుసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది కమిటీ. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి డిజైన్, రికార్డ్స్ డిజిటలైజేషన్ బాధ్యతను విదేశీ కంపెనీకి అప్పగించింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులను ధరణి సమస్యలపై అధ్యయనానికి పిలిచింది. కానీ ఆ కంపెనీ స్పందించట్లేదు. మూడుసార్లు సమాచారం ఇచ్చినా ఇంతవరకు నో రెస్పాన్స్. ఫాల్కన్ కంపెనీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ధరణి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ధరణి కమిటీ సమావేశం తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఆ కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. పోర్టల్ డిజైన్ చేసిన విదేశీ కంపెనీ దగ్గరే రైతుల వివరాలన్నీ ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి డిజిటలైజేషన్‌ను అప్పగించి పొరపాటు చేసిందన్నారు. మూడు సార్లు పిలిచినా ఫాల్కన్ కంపెనీ ప్రతినిధులు రాకపోవడంతో కమిటీ సభ్యులకు మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. దీంతో నాలుగోసారి కూడా పిలిచి, తప్పకుండా రావాలని కండిషన్ పెడుతారా.. లేక ఈ ఆంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తారా అన్నది త్వరలోనే తేలనుంది.