తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కవితకు కీలక పదవి!

|

Aug 29, 2019 | 11:00 AM

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన చేయడానికి  సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తుది కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు సెప్టెంబర్ 4న ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు ఇన్‌సైడ్ టాక్. ఇక ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్ రావుకు చోటు దక్కుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా […]

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కవితకు కీలక పదవి!
Follow us on

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన చేయడానికి  సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే తుది కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణకు సెప్టెంబర్ 4న ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం దాదాపు ఖరారైనట్లు ఇన్‌సైడ్ టాక్. ఇక ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్ రావుకు చోటు దక్కుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మంత్రుల్లో నలుగురు పదవుల మీద కత్తి వేలాడుతున్నట్లుగా సమాచారం. ఇక మహిళా మంత్రి లేని కేబినెట్‌గా విమర్శలు ఎదుర్కుంటున్న సమయంలో.. ఇద్దరు మహిళలకు పదవులు కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది.

ఇది ఇలా ఉండగా మాజీ ఎంపీ కవితకు పార్టీలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న కేటీఆర్.. త్వరలో తెలంగాణ మంత్రివర్గంలోకి చేరితే.. కవితను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి కొంతమంది అయితే ఆమెను మహిళా మంత్రిగా తీసుకుంటారని ఇన్‌సైడ్ టాక్. కాగా సీఎం కేసీఆర్ దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.