
తెలంగాణ సీఐడీ ఓ నోట్ రిలీజ్ చేసింది. ‘ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి, HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు’ అనేది జగన్‌మోహన్‌రావుపై సీఐడీ చేసిన ఆరోపణ. అంతేకాదు.. అధ్యక్షుడి హోదాలో నిధులు గోల్‌మాల్ చేశారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నారు. అరెస్ట్‌కు కారణం ఇదేనని ఓ క్లారిటీ ఇచ్చింది సీఐడీ. జగన్‌మోహన్‌రావుతో పాటు మరో నలుగురురిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇంతకీ ఈ కథలో ఏం జరిగిందంటే.. గౌలిపురా క్రికెట్ క్లబ్ ఉంది హైదరాబాద్‌లో. ఆ క్లబ్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్. ఈయన మాజీ మంత్రి కూడా. ఈ కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న కవిత ఫోర్జరీ చేశారు. కవితకు HCA ఆఫీస్ బేరర్ రాజేందర్ యాదవ్ సహకరించారు. వీళ్లిద్దరూ భార్యాభర్తలు కూడా. అలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను జగన్మోహన్‌కు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ఉపయోగించే.. HCA అధ్యక్ష పదవికి పోటీ చేశారు జగన్‌మోహన్‌రావు. HCAకి అధ్యక్షుడు అయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది జగన్‌మోహన్‌రావుపై ఉన్న ప్రధాన అభియోగం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. సో, అలా రంగంలోకి దిగిన సీఐడీ.. HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేలతో కలిసి సుమారు 2 కోట్ల 32 లక్షల రూపాయల నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు తేల్చింది. అందుకే, జగన్‌మోహన్‌రావును అరెస్ట్ చేసింది. సహకరించిన HCA...