AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ.35 వేల మద్యం బాటిల్ పగిలింది : ఇండిగోకు వినియోగదారుల కమిషన్ షాక్

ఢిల్లీ నుంచి చెన్నైకి ఇండిగో విమానంలో ప్రయాణించిన వినీత్ చెక్-ఇన్ బ్యాగేజీలో ఉన్న రూ.35 వేల విలువైన ప్రీమియం మద్యం బాటిల్ పగిలిపోవడంతో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III కీలక తీర్పు ఇచ్చింది. కేవలం రూ.500 వోచర్ మాత్రమే ఆఫర్ చేసిన ఇండిగో సేవల్లో లోపం ఉందని తేల్చిన కమిషన్..

Hyderabad: రూ.35 వేల మద్యం బాటిల్ పగిలింది : ఇండిగోకు వినియోగదారుల కమిషన్ షాక్
Liquor Bottle
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 12:24 PM

Share

ఒక ప్రీమియం మద్యం బాటిల్ పగిలిపోవడంతో ప్రయాణికుడికి రూ.500 వోచర్ మాత్రమే ఆఫర్ చేసిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III గట్టి షాక్ ఇచ్చింది. దెబ్బతిన్న బాటిల్ పూర్తి విలువతో పాటు మానసిక వేదన, కోర్టు ఖర్చులు కలిపి పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. యూసుఫ్‌గూడకు చెందిన వినీత్ 2025 సెప్టెంబర్ 3న ఢిల్లీ నుంచి చెన్నైకి ఇండిగో విమానంలో ప్రయాణించారు. చెక్-ఇన్ చేసే సమయంలో తన సూట్‌కేసులో రూ.35 వేల విలువైన ప్రీమియం వైట్ అండ్ బ్లూ మద్యం బాటిల్ ఉందని, అది అత్యంత సున్నితమైన వస్తువని ఎయిర్‌లైన్స్ సిబ్బందికి ముందుగానే తెలిపారు.

అయితే చెన్నై చేరుకుని బ్యాగేజీ తీసుకున్న తర్వాత సూట్‌కేసు తెరిచి చూడగా బాటిల్ పూర్తిగా పగిలిపోయింది. మద్యం చిందిపోవడంతో సూట్‌కేసులోని ఇతర వస్తువులు కూడా దెబ్బతిన్నాయి. విమానాశ్రయంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ-మెయిల్ ద్వారా ఇండిగోను సంప్రదించారు. బాటిల్ సరిగా ప్యాక్ చేసిన విషయాన్ని అంగీకరించిన ఇండిగో.. తమ బ్యాగేజీ నిబంధనల ప్రకారం సున్నితమైన వస్తువులను ప్రయాణికులే తమ బాధ్యతపై తీసుకెళ్లాలని పేర్కొంటూ కేవలం రూ.500 విలువైన వోచర్‌ను మాత్రమే ఆఫర్ చేసింది. దీనిపై అసంతృప్తి చెందిన వినీత్ లీగల్ నోటీసు పంపి అనంతరం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణకు ఇండిగో ప్రతినిధులు హాజరుకాలేదు.

కేసును విచారించిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-III.. చెక్-ఇన్ బ్యాగేజీని నిర్లక్ష్యంగా నిర్వహించినందుకు ఇండిగో సేవల్లో లోపం ఉందని తేల్చింది. దెబ్బతిన్న మద్యం బాటిల్ విలువ రూ.35,000ను 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, అదనంగా మానసిక వేదనకు రూ.15,000, వ్యాజ్య ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!