సామాజిక సేవ చేయాలంటే వయసుతో సంబంధం లేదు. మంచి మనసు ఉంటే చాలని ఓ చిన్నారి పాప నిరూపించింది. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌కు చెందిన 16 నెలల అమ్మాయి కైర జువెంటస్ తన జుట్టును డోనేట్ చేసింది. అతి చిన్న వయసులోనే హెయిర్ డోనర్‌గా కైర జువెంటస్ నిలిచింది.
అదేంటి జుట్టును డోనేట్ చేయడం ఏంటీ అని సందేహపడుతున్నారా ? నిజమే.. ఈ చిన్నారి చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్యాన్సర్ రోగులకు జుట్టు ఎక్కువగా ఉడిపోతుంది. ఈ వ్యాధి ముదురుతున్న సమయంలో వీరికి ఎక్కువగా రాలిపోతుంది. దీంతో రోగులు విశ్వాసం కోల్పోతుంటారు. అయితే క్యాన్సర్ కారణంగా జుట్టు ఉడిపోయిన వారు విగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం కొన్ని సంస్థలు ప్రత్యేకంగా విగ్స్ తయారు చేస్తుంటారు. కొందరు దాతలు అందించిన వెంట్రకలతో ప్రత్యేకంగా క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే చిన్నారి కైర క్యాన్సర్ రోగులకు ఉపయోగపడేలా తన తల నీలాలను దానం చేసింది. ఇలా చెయ్యడం ద్వారా కొంతమంది క్యాన్సర్ బాధితులకైనా జీవితం మీద ఆశ కలుగుతుంది. ఈ చిన్న అమ్మాయి చేసిన పని అందరిని ఆలోచింపజేస్తుంది. హైదరాబాద్ హెయిర్ డోనేషన్ ఫౌండేషన్ కు కైర జువెంటస్ తన వెంట్రుకలు విరాళంగా అందించింది. కైర జుట్టును వారు అవసరమైన క్యాన్సర్ రోగికి విగ్ రూపంలో అందించనున్నారు.
Kajol Birthday: సాహసం చేసిన కాజోల్.. ఒకవేళ పట్టు తప్పితే హీరోయిన్గా ఉండడం కష్టమేనట.
India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. కేసుల్లో హెచ్చుతగ్గులు.. కొత్తగా ఎన్నంటే.!