Grand IMA 4th Awards: రియల్ హీరోలకు అవార్డులు ప్రదానం చేసిన గవర్నర్.. టీవీ9 జర్నలిస్టులకు..
హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్ లో జరిగిన ఐఎంఎ ఇంపాక్ట్ కాన్ 2024 సైంటిఫిక్ సెమినార్‌లో భాగంగా సామాజిక సేవకులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చిత్తూరు ఎంపీ పలువురికి అవార్డులు అందజేసి సత్కరించారు. ఐఎంఎ బంజారాహిల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.
వైద్యో నారాయణో హరి అంటారు.. ప్రాణం పోసే వాడు దేవుడు అయితే.. ప్రాణాలు నిలబెట్టే వారు వైద్యులు అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అంటూ కొనియాడారు.. భారతదేశంలో వైద్యరంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. అందరినీ వైద్యం అందలన్న లక్ష్యం ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా.. వైద్యులపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు. హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌లో జరిగిన ఐఎంఎ ఇంపాక్ట్ కాన్ 2024 సైంటిఫిక్ సెమినార్ ఘనంగా జరిగింది.. ఐఎంఎ బంజారాహిల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు.. ఈ సదస్సులో భాగంగా సామాజిక సేవకులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చిత్తూరు ఎంపీ అవార్డులు అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా మానవ సేవయే మాధవ సేవ అనే మాటలకు సార్థకత చేకూరుస్తూ సామాజిక సేవలో తరిస్తున్న పలువురు వైద్యులు, జర్నలిస్టులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఘనంగా సన్మానించి.. అవార్డులను ప్రదానం చేసింది. దీనిలో భాగంగా మీడియా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న టీవీ9కు చెందిన ఇద్దరు జర్నలిస్టులకు ఈ అవార్డులు దక్కాయి.. .
టీవీ9 జర్నలిస్టులకు అవార్డులు..
జర్నలిజంలో చేసిన సేవలకు గాను టీవీ9 అసోసియేటెడ్ ఎడిటర్, డాక్టర్ కొండవీటి శివ నాగరాజు, టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ ఎలెందర్ రెడ్డికి IMA ఇంపాక్ట్ అవార్డులు దక్కాయి. ఉత్తమ జర్నలిస్టుగా
టీవీ9 అసోసియేట్ ఎడిటర్ శివనాగరాజు గవర్నర్ చేతుల మీదుగా, టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ ఎలెందర్ రెడ్డి చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య రంగంలోని వివిధ విభాగాల్లో వస్తున్న మార్పులు, శాస్త్రీయ పరిష్కారాలపై ఆయా విభాగాల వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వివరించారు. వైద్యులు – సవాళ్లు అనే చర్చా కార్యక్రమంలో భాగంగా వైద్యులపై దాడులు అనే అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. వైద్యులపై దాడులు అరికట్టేందుకు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ఐఎంఏ ఇంపాక్ట్ కార్యక్రమంలో సమాజ సేవలో నిర్విరావంగా కృషి చేస్తున్న పలువురికి ఈ అవార్డులు ప్రదానం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..