
Criminal Cases: హైదరాబాద్‌లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన నలుగురు వ్యక్తులపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పరిధిలోని బోలా నగర్‌లో ఒకే వీధిలో నివసిస్తున్న షేక్ దావూద్, సోగ్రా బేగమ్, నసీన్ రజత్ ఖాన్, మహమ్మద్ తాఖీ లు జలమండలి అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత యజమానుల మీద స్థానిక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 430 ఐపీసీ సెక్షన్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు కోరారు.
Covid Vaccine: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?