Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. శనివారం పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి..

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకున్న మోదీ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్..

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. శనివారం పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లకండి..
Hyderabad Traffic

Updated on: Nov 11, 2022 | 8:15 PM

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకింతం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నానికి చేరుకున్న మోదీ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 12వ తేదీన నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

బేగంపేట ఎయిర్‌ పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని తెలిపారు. పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలని ఎంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్‌ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే విశాఖ నుంచి మోదీ నేరుగా శనివారం మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి బీజేపీ లీడర్లు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీ విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో కాసేపు మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు హెలికాప్టర్‌లో రామగుండం వెళ్లనున్నారు. అనంతరం 3.30 గంటలకు రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించి, సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు సభా స్థలి నుంచే శంకుస్థాపన చేయనున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..