
హైదరాబాద్‌లో వాహనదారులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రధాన రహదారి కుంగిపోవడంతో అవాక్కయ్యారు. అయితే ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. చాదర్‌ఘాట్ రహదారిలో శుక్రవారం రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో పెద్ద గుంతపడింది.
పాతబస్తీలోని చాదర్ ఘాట్ ప్రధాన రహదారిపై 20 అడుగుల సివరేజ్ గుంత కుంగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం కావడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. వాటర్ వర్క్స్ అధికారులు సంఘటన స్థలం దగ్గర గుంతను తవ్వి తిరిగి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అజంపురా వాటర వర్క్స్ AE ఆనందరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే రోడ్డు మధ్యలో అసలు గుంత ఎందుకు పడిందో తెలియదని వాటర్ బోర్డ్, GHMC అధికారులు చెబుతున్నారు. సివరేజ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయ్యి ఉంటుందని వాటర్ బోర్డ్, బల్దియా అధికారులు భావిస్తున్నారు. కింద 20 ఫీట్ల లోతు ఉంటుందని అధికారులు చెప్పడంతో… చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. గుంత పెద్దగా అయ్యే అవకాశం ఉండకపోవచ్చని వాటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..