Hyderabad: హైదరాబాదీయులకు కరోనా భయం పోయినట్లేనా.. సగం మందిలో యాంటీబాడీలు.. సర్వేలో తేలిన వివరాలు..

Corona In Hyderabad: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం సోషల్‌ డిస్టెంట్స్‌ పాటించకపోవడం. మరి కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లాంటి మహా నగరంలో సోషల్ డిస్టెంట్స్‌ అంత సులభంగా సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత..

Hyderabad: హైదరాబాదీయులకు కరోనా భయం పోయినట్లేనా.. సగం మందిలో యాంటీబాడీలు.. సర్వేలో తేలిన వివరాలు..
Follow us

|

Updated on: Mar 04, 2021 | 9:51 PM

Corona In Hyderabad: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం సోషల్‌ డిస్టెంట్స్‌ పాటించకపోవడం. మరి కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లాంటి మహా నగరంలో సోషల్ డిస్టెంట్స్‌ అంత సులభంగా సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఒకేసారి జనాలు రోడ్లపైకి వచ్చారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరగాలి కదా.. కానీ అంతలా పెరగలేవు. ఈ క్రమంలోనే తాజాగా భాగ్యనగరంలో నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పట్నంలో సగానికిపైగా మందికి ఇప్పటికే కరోనా వచ్చి వెళ్లిపోయిందని ఈ సర్వేలో తేలింది. నగరంలో ఏకంగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు సీసీఎంబీ, భారత్ బయోటెక్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌లోని 30 వార్డుల్లో సుమారు 9 వేల మంది నుంచి సేకరించిన శాస్ర్తవేత్తలు పరీక్షలు నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక యాంటీ బాడీలు ఉన్న వారిలో 56 శాతంతో మహిళలు ముందు వరుసలో ఉండగా.. పురుషులు 53 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఇక 70 ఏళ్లు పైబడిన 49 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందడం విశేషం. ఇక కరోనా నుంచి కోలుకున్న వారి కుటుంబాల్లోని 78 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ లెక్కన చూసుకుంటే హైదరాబాదీలు కరోనాను జయించినట్లేనని అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే ఆధారంగా హైదరాబాదీలు నెమ్మదిగా హెర్డ్‌ ఇమ్యూనిటీ వైపు అడుగులు వేస్తున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వామన్ రావు దంపతుల హత్య కేసుః ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ.. ఐదో నిందితుడు లచ్చయ్య అరెస్ట్

హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్… లైసెన్స్ లేకుండా బండి ఇస్తే ఇక అంతే.. మరిన్ని తెలుసుకోవాల్సిన విషయాలు..!

ITIR Controversy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాకరేపుతున్న ఐటీఐఆర్.. ఎవరి వాదన ఎలా వున్నా.. ఇప్పటి వరకు జరిగిందిదే!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!