హైదరాబాదీ బిర్యానీ భారతదేశంలోని రుచికరమైన వంటలలో ఒకటి అని అందరికీ తెలుసు. కానీ దానిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AJFST) ఇటీవల ప్రచురించిన జర్నల్‌లో హైదరబాద్ బిర్యానీ తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో వెల్లడించింది. ఇందులో అన్నం, కూరగాయలు, గుడ్డు, మాంసం మొదలైన అనేక రకాల పదార్థాలు ఉన్నందున, ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నదని వెల్లడించింది.
హైదరాబాదీ బిర్యానీలో యాంటీఆక్సిడెంట్లు ఉండే మసాలాలు ఉన్నందున, ఇది అంతర్గత అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. బిర్యానీ తయారీలో ఉపయోగించే నల్ల మిరియాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు, మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి మొదలైనవి పుష్కలంగా ఉంటాయి కనుక శరీరానికి తగినంత విటమిన్లు అందుతాయి. బిర్యానీలోని మసాలా దినుసులు కాలేయ యాంటీఆక్సిడెంట్‌గా పిలువబడే గ్లూటాతియోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. హైదరాబాదీ బిర్యానీ తయారీలో ఉపయోగించే కుంకుమపువ్వు కాలేయ ఎంజైమ్‌లను పెంచి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
2022లో స్విగ్గీలో ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా ఆర్డర్ చేసిన టాప్ 10 వంటకాల జాబితాలో చికెన్, వెజ్ బిర్యానీ రెండూ ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే జరిగింది. స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం, 2021లో నిమిషానికి 115 ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..