Watch Video: ఆటగదరాశివ! గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్.. స్పాట్‌లోనే..

హైదరాబాద్‌ నగరంలో బండ్లగూడలో తీవ్ర విషాదం వెలుగచూసింది. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా.. విగ్రహం విద్యుత్‌ వైర్లకు తగిలి వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

Watch Video: ఆటగదరాశివ! గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్.. స్పాట్‌లోనే..
Electric Shock

Edited By: Jyothi Gadda

Updated on: Aug 20, 2025 | 12:24 PM

వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా.. విగ్రహం విద్యుత్‌ వైర్లకు తగిలి వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌ నగరంలో బండ్లగూడలో వెలుగు చూసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం, తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జల్పల్లి గణేష్ మార్కెట్ నుండి పాత నగరంలోని లాల్ దర్వాజాకు ఒక పెద్ద గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. వాహనం రాయల్ సీ హోటల్ పాయింట్‌కు చేరుకోగానే.. భారీ వినాయక విగ్రహం కొన ఓవర్ హెడ్ హైటెన్షన్ వైర్లకు తాకింది. దీంతో ఒక్కసారిగా వాహనానికి షాక్‌ తగిలింది.

దీంతో ట్రాక్టర్ పై ఉన్న వికాస్ తో పాటు మరో వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తి హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వీడియో చూడండి..

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా కాలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేమాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత క్రేన్‌ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.