AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC EPFO 2025 Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలకు తుది గడువు పెరిగిందోచ్‌..! ఎప్పటివరకంటే?

ఈపీఎఫ్‌వో).. ఎన్ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 230 పోస్టులను చేయనున్నట్లు అందులో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 156, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టులు 74 వరకు..

UPSC EPFO 2025 Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగాలకు తుది గడువు పెరిగిందోచ్‌..! ఎప్పటివరకంటే?
UPSC EPFO Jobs
Srilakshmi C
|

Updated on: Aug 19, 2025 | 2:14 PM

Share

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో).. ఎన్ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, అకౌంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టుల భర్తీకి గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 230 పోస్టులను చేయనున్నట్లు అందులో తెలిపింది. మొత్తం పోస్టుల్లో ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులు 156, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ పోస్టులు 74 వరకు ఉన్నాయి. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా అదే నెలలో 29వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్ట్‌ 18, 2025వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తుది గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును పొడిగిస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఆగస్ట్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కమిషన్‌ సూచించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ముఖ్యంగా కంపెనీ లా, లేబర్ లా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఎన్ఫోర్స్‌మెంట్‌, అకౌంట్‌ ఆఫీసర్‌ పోస్టులకు 30 ఏళ్లు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్‌ పోస్టులకు 35 ఏళ్లకు మించకూడదు. నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనల మేరకు ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల చొప్పున వయోసడలింపు ఉంటుంది.

ఒక పోస్టుకు అప్లై చేసేవారు రూ.25, రెండు పోస్టులకు దరఖాస్తు చేసేవారు రూ.50 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన వారు తుది గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CRT), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ ఈపీఎఫ్‌ఓ షాట్ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం