
ఐపీఎల్ సీజన్ 2024 ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరుకుంది. మ్యాచ్‌ను స్టేడియం నుండి ప్రత్యక్షంగా చూడటం కంటే గొప్ప అవకాశం ఏముంటుంది. అందుకే హైదరాబాదీలు నేరుగా స్టేడియం చేరుకుని మ్యాచ్ ను వీక్షించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ తరుణంలోనే మెట్రో రైలు సదుపాయాన్ని రోజు వారికంటే మెరుగ్గా కొనసాగించేందుకు ముందుకు వచ్చారు ఆ సంస్థ అధికారులు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు అమలవుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మార్చి 27న జరగనున్న IPL 2024కి ముందు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. ట్రాఫిక్ సజావుగా సాగడం కోసం అధికారులు కీలక అదేశాలు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ మధ్య IPL మ్యాచ్ జరగనున్న దృష్ట్యా మార్చి 27, 2024 న సాయంత్రం 4 నుండి రాత్రి 11:50 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మ్యాచ్ కారణంగా నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారీ వాహనాలు, లారీలు, డంపర్లు, టిప్పర్ లారీలు, వాటర్ ట్యాంకర్లు, ఆర్‌ఎంసి ట్రక్కులతో పాటు ఇతర భారీ వాహనాలను నగరంలో ఈ ప్రాంతాల్లో అనుమతి ఉండదని పేర్కొన్నారు. ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి రూట్ 1కి చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ను ఎల్‌బి నగర్ నుండి నాగోల్, ఉప్పల్, నాగోల్ మెట్రో స్టేషన్ కింద, యు-టర్న్ నాగోల్ మెట్రో స్టేషన్, హెచ్‌ఎండీఏ లేఅవుట్, బోడుప్పల్- బోడుప్పల్- చెంగిచెర్ల ఎక్స్‌రోడ్డుకు మళ్లించారు. అలాగే తార్నాక నుంచి ఉప్పల్ హబ్సిగూడ ఎక్స్‌రోడ్డు వైపు, నాచారం, ఐఓసీఎల్ చెర్లపల్లి వైపు మళ్లిస్తారు. రోజు వివిధ కార్యకలాపాల దృష్ట్యా రోడ్డెక్కే ప్రయాణికులు పైనపేర్కొన్న రూట్‌లలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సూచించారు. అలాగే ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
హైదరాబాద్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, ప్రజలను కాపాడేందుకు ఈ ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్‌ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించినట్లు పేర్కొన్నారు. ఉప్పల్ మార్గంలో వెళ్లే మెట్రో రైలు టైమింగ్స్ ను రోజు వారి సమయం కంటే ఎక్కువగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఈ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ స్టేడియం నుంచి చివరి రైలు రాత్రి 12.15 గంటలకు బయలుదేరుతుందని.. 1.10కి గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..