Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ప్రజలకు ముఖ్య సూచన.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ మార్గాల్లో వెళ్తే ఇబ్బందులే!
Traffic Alert: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సంధర్బంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Hyderabad Traffic Restricti
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి, విగ్రహావిష్కరణ సందర్భంగా సంధర్బంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నెక్లెస్ రోడ్డులో సోమవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతులు ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్, నిరంకారీ జంక్షన్ వైపు అనుమతిస్తారు.
- మినిస్టర్ రోడ్డు నుంచి సంజీవయ్య పార్క్ వైపు వాహనాలను అనుమతించరు. బుద్ధభవన్ వద్ద దారిలో అనుమతిస్తారు.
- ట్యాంక్‌బండ్ నుంచి సంజీవయ్య పార్కుకు వచ్చే వాహనాలు కర్బాలా మైదాన్ వైపు వెళ్లాలి.
- మింట్ కంపౌండ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్ వద్ద మళ్లిస్తారు.
- తెలుగుతల్లి బ్రిడ్జి మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ దగ్గర మళ్లిస్తారు. పీవీ జ్ఞానభూమికి ఎలా రావాలంటే..
- సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు రసూల్‌పురా జంక్షన్ నుంచి మినిస్టర్ రోడ్డు -కిమ్స్ దవాఖాన-నల్లగుట్ట బ్రిడ్జి, సంజీవయ్య పార్క్ మీదుగా పీవీ జ్ఞాన భూమికి చేరుకోవాలి.
- అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు అప్పర్ ట్యాంక్ బండ్-సెయిలింగ్ క్లబ్-బుద్ధ భవన్-సంజీవయ్య పార్క్-పీవీ జ్ఞాన భూమి వద్దకు చేరుకోవాలి.
- వాహనాల పార్కింగ్‌ను ఎంఎంటీఎస్ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు.