Hyderabad: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్… పట్టుబడిన వాహనదారులకు రోడ్డు పైనే..

| Edited By: Jyothi Gadda

Nov 09, 2024 | 6:39 PM

బేగంపేట్ మెట్రో స్టేషన్ పరిధిలో టీవీ9 తో కలిసి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  ఇక ఈ సంవత్సరం మూడు లక్షలకు పైగా హెల్మెట్ లేని వాహనదారులపై కేసులు నమోదు చేశామని, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 1600 కు పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు.

Hyderabad: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్... పట్టుబడిన వాహనదారులకు రోడ్డు పైనే..
Traffic Police
Follow us on

హైదరాబాద్ నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా పోలీసులు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నారు. ఈనెల 5వ తారీఖున ప్రారంభమైనటువంటి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లలో దాదాపు 1600 కేసులు నమోదు చేశారు…

బేగంపేట్ మెట్రో స్టేషన్ పరిధిలో టీవీ9 తో కలిసి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  ఈ తనిఖీలలో వందల ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అలా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డుపైన కౌన్సిలింగ్ చేశారు ట్రాఫిక్ డిసిపి రాహుల్. జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ లేక తలకు తీవ్ర గాయమై చనిపోయినటువంటి కేసులు ఎక్కువగా ఉన్నాయని టీవీ 9 తో ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే అన్నారు. ఇక ఈ సంవత్సరం మూడు లక్షలకు పైగా హెల్మెట్ లేని వాహనదారులపై కేసులు నమోదు చేశామని, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా 1600 కు పైగా కేసులు నమోదు చేశామని తెలిపారు.

బేగంపేట్ మెట్రో స్టేషన్ వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనాలను చెక్ చేశారు రాహుల్ హెగ్డె. సుమారు 100కు పైగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు లేకపోగా, వారిని రోడ్డుపైనే ఉంచి కౌన్సిలింగ్ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని తెలిపారు. హెల్మెట్ ఉంచుకొని కూడా కొందరు ధరించకపోవడంతో ఆ రకంగా కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. హెల్మెట్ ధరించకపోతే వారికి 200 రూపాయలు జరిమానా, రాంగ్ రూట్లో వెళ్తే వెయ్యి రూపాయల జరిమానా ఉంటుందని ట్రాఫిక్ డిసిపి తెలిపారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తమను పోలీసులు ఆపారని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు తమకు కౌన్సిలింగ్ ఇచ్చారని హెల్మెట్ ధరించుకోవాలని సూచించారు. మా మంచి గురించే ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ ను కండక్ట్ చేశారు. ఇక హెల్మెట్ లేకుండా తాము ప్రయాణించమని, ఇకమీదట హెల్మెట్ ధరించి ప్రయాణిస్తామని ట్రాఫిక్ డిసిపి ఎదుట వాహనదారులు వాగ్దానం చేశారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..