Telangana: వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరిక.. వాటిని తొలగించకపోతే అంతే సంగతులు!

|

Jun 16, 2022 | 4:19 PM

వాహనదారులకు హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. వాటి తొలగించకుండా రోడ్డుపైకి వచ్చారో అంతే సంగతులని తెలిపారు..

Telangana: వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ హెచ్చరిక.. వాటిని తొలగించకపోతే అంతే సంగతులు!
Vehicle Documents
Follow us on

తప్పుడు నెంబర్ ప్లేట్లు.. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు.. మాస్కులు పెట్టి నెంబర్ ప్లేట్లు కవర్ చేయడం.. పెండింగ్ చలానాలను ఎగ్గొట్టడం.. కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లు తగిలించుకోవడం.. ఇలా ఎన్నో రకాల ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ చాలామంది వాహనదారులు నగరంలో దర్జాగా తిరిగేస్తున్నారు. ఇలా తిరుగుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నజర్ పెట్టారు. ఈ నెల 18వ తేదీన మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

అద్దాలకు బ్లాక్ ‌ఫిల్మ్‌లు అతికించిన కార్లను, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలు, పెండింగ్ చలానాలు క్లియర్ చేయకపోయినా.. అలాంటి వాహనాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అంతేకాదు.. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసి.. నెల కావొస్తున్నా ఇంకా తాత్కాలిక నెంబర్‌తోనే తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసేవారిపై ఇపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఎఫ్ సెక్షన్ 21 ప్రకారం ఛార్జీషీట్లు దాఖలు చేసి.. న్యాయస్థానంలో హాజరు పరుస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగానాధ్ వెల్లడించారు. కాగా, సంబంధిత వాహనాలను ఎక్కడైనా గుర్తిస్తే 9010203626 నెంబర్‌ను ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..