Traffic Police: అందులో నిజం లేదు.. ఆ వార్తను ఫార్వర్డ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్నింగ్‌.

|

Sep 04, 2021 | 8:34 AM

Hyderabad Traffic Police: ఇటీవల హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారింది. ఒకప్పటిలా రోడ్డుపై వాహనాలను ఆపి చలాన్లు వసూలు చేసే కాలం పోయింది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌...

Traffic Police: అందులో నిజం లేదు.. ఆ వార్తను ఫార్వర్డ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వార్నింగ్‌.
Hyderabad Traffic Police
Follow us on

Hyderabad Traffic Police: ఇటీవల హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారింది. ఒకప్పటిలా రోడ్డుపై వాహనాలను ఆపి చలాన్లు వసూలు చేసే కాలం పోయింది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ చలాన్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్‌లు నేరుగా ఫోన్‌కు మెసేజ్‌ వస్తున్నాయి. చలాన్‌ల తాలుకూ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పెండింగ్‌లో ఉన్న ఈచలాన్‌పై పోలీసులు బంపరాఫర్‌ ఇచ్చినట్లు ఇటీవల ఓ వార్త హల్చల్‌ చేస్తోంది.

దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు లోక్‌అదాలత్‌లో పెండింగ్‌ చలాన్‌లను చెల్లించే వారికి 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా హల్చల్‌ చేస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ఈ విషయమై స్పందించారు. దీనిపై ట్విట్టర్‌ వేదికగా.. ‘చలాన్‌లపై డిస్కౌంట్‌ అంటూ ఓ ఫేక్‌ వార్త వైరల్‌ అవుతోంది. ఈ వార్తను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి, షేర్‌ చేయకండి. ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాము’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయ్యింది.

పోలీసులు చేసిన ట్వీట్..

Also Read: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌లో నేడు జాబ్‌మేళా.. టెక్‌మహీంద్ర, విప్రో వంటి టాప్‌ కంపెనీలు హాజరు.

CM KCR: ఢిల్లీలో మూడో రోజు సీఎం కేసీఆర్ పర్యటన.. నేడు కేంద్రమంత్రులు అమిత్‌ షా, షెకావత్‌ సహా పలువురితో కీలక భేటీలు.!

Double Bed Room: సామాన్యుడి అమాకత్వమే వారి పెట్టుబడి.. పత్రాల్లో డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు.. లక్షల్లో వసూళ్లు..!