Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు

|

Aug 29, 2024 | 7:32 AM

మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించి జరిమానాతో పాటు 3 నెలల నుంచి 6 నెలల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. అయితే ఇప్పుడీ విధానాన్ని ఇతర ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్...

Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. ఇలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తారు
Hyderabad Traffic
Follow us on

అధికారులు ఎన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మెజారిటీ రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లేనని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. డ్రంక్‌ డ్రైవ్‌ చేసి పట్టుబడితే లైసెన్స్‌లను రద్దు చేసే విధానం ప్రస్తుతం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రంక్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించి జరిమానాతో పాటు 3 నెలల నుంచి 6 నెలల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. అయితే ఇప్పుడీ విధానాన్ని ఇతర ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ట్రాఫిక్‌ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రాంగ్‌ రూట్‌లో వెళ్లే వారితో పాటు, ర్యాష్‌ డ్రైవింగ్ చేసే వారి లైసెన్స్‌లు రద్దు చేయనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా రద్దయ్యేలా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలోనే గ్రేటర్‌లో అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై షార్ట్ కట్‌ అవుతుందని.. రాంగ్ రూట్‌లో వెళ్తే అసలుకే ఎసరు వస్తుందన్నమాట.

కాగా నగరంలోని కొన్ని జాతీయ రహదారులపై పాదచారులకు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారుతోంది. చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో హైవేలపై ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక రాచకొండ కమిషనరేట పరిధిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 103 బ్లాక్‌స్పాట్స్‌ను పోలీసులు గుర్తించారు. వీటి మరమ్మతులు, నిర్వహణపై జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, ఇతరత్రా విభాగాలతో జరిగిన సమావేశంలో చర్చించారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఎత్తును పెంచడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..