Hyderabad: కంపెనీ సిమ్ కార్డు ఇంటికి వచ్చి తీసుకోవాలని ఆమెకు చెప్పాడు.. కట్ చేస్తే

|

May 11, 2024 | 9:36 AM

ఎన్నో ఆశలతో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వస్తే.. వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో మధురానగర్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఆ డీటేల్స్...

Hyderabad: కంపెనీ సిమ్ కార్డు ఇంటికి వచ్చి తీసుకోవాలని ఆమెకు చెప్పాడు.. కట్ చేస్తే
Home Door
Follow us on

ఎన్నో ఆశలతో జాబ్ కోసం వచ్చిన యువతిని ట్రాప్ చేసి.. లైంగిక దాడికి యత్నించాడు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ మేనేజర్. హైదరాబాద్ మధురానగర్‌లో ఉన్న టెక్ ఫ్లో అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి అప్లై చేసింది. కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూ  అటెండ్ అవ్వాలంటూ ఆమెకు కాల్ వచ్చింది. దీంతో ఆ అమ్మాయి.. మధురానగర్‌లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వెళ్లింది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక.. కంపెనీ మేనేజర్ అయిన నవీన్ కుమార్.. ఆ అమ్మాయి జాబ్‌కు సెలెక్ట్ అయినట్లు చెప్పాడు చెప్పాడు. వెంటనే జాయిన్ కావొచ్చు అని కూడా చెప్పాడు. జాబ్ వచ్చిందన్న ఆ అమ్మాయి ఆనందం అంతా ఇంతా కాదు. ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి తన సంతోషాన్ని వెలిబుచ్చింది.

ఈ క్రమంలో ఆఫీసు సిమ్ కార్డు తీసుకోమని చెప్పాడు. తాను బిజీగా ఉన్నందున సిమ్ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలని సూచించాడు. జాబ్ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఆ యువతికి మేనేజర్‌పై డౌట్ రాలేదు. అమ్మాయి ఇంటికి వచ్చిందంటే.. ఇక అన్నింటికీ రెడీ అయ్యే వచ్చిందన్న పాడు నిర్ణయానికి వచ్చిన మేనేజర్.. ఆమె ఇంట్లోకి రాగానే డోర్స్ లాక్ చేసి.. అత్యాచారం చేయడానికి యత్నించాడు. అరెస్తే.. చంపేస్తానని బెదిరించాడు. అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆ యువతి.. నేరుగా మధురానగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా.. ఉద్యోగం కోసం ఆరాటపడే అమ్మాయిల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తుంటారని.. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…