హైటెక్ హంగులు.. కాస్టిలీ బిల్లులు.. వీఐపీలు వచ్చి పోయే విలాసవంతమైన భవనం.. మాయమైన ఖరీదైన కారు..!
హైదరాబాద్ మహానగరంలో పెద్ద హోటళ్ల భద్రతా వ్యవస్థ డొల్లతనం మరోసారి బయటపడింది. విలాసవంతమైన హోటల్‌లో వాహనాలకు సెక్యూరిటీ లేకుండా పోయింది.
Star Hotels lack security : విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో పెద్ద హోటళ్ల భద్రతా వ్యవస్థ డొల్లతనం మరోసారి బయటపడింది. పేరుకే అదొక ఫైవ్ స్టార్ హోటల్ కానీ భద్రత మాత్రం శూన్యం. విఐపీలు ,వివిఐపిలు బస చేసే అత్యంత విలాసవంతమైన హోటల్‌లో వాహనాలకు సెక్యూరిటీ లేకుండా పోయింది. పైగా తమకు జరిగిన నష్టంపై అడిగిన బాధితులకు చుక్కలు చూపించారు. లక్షలు వెచ్చించి బస చేసే హోటల్‌ల్లో భద్రత కరువవడం పలు అనుమానాలకు తావిస్తోంది….
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని అత్యంత విలాసవంతమైన హోటల్ పార్క్ హయత్‌లో గత కొన్ని రోజులుగా వాహనాలు మిస్ అవుతున్నాయి. వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉండే ఈ హోటల్లో విలువైన కార్లు చోరీకి గురికావడం కలవరానికి గురిచేస్తుంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా హోటల్ యాజమాన్యం పెద్దగా స్పందించలేదన్న ఆరోపణలు వినిపించాయి. తాజాగా మరోసారి జరగడం వెనుక హోటల్ సిబ్బంది వైపల్యం స్పష్టంగా కనిపిస్తుందని బాధితుల ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
గత నెల 22 వ తేదీన సింధూ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన మంజునాధ్ పార్క్ హయత్‌లో బస చేశాడు. అదే నెల 26 బయటికి వెళ్లి సాయంత్రం ఆరు గంటల సమయంలో హోటల్‌లో తన కారును పార్కింగ్ చేశారు. మరుసటిరోజు రోజున వచ్చి చూసేసరికి కారు కనిపించలేదు. తాన వ్యక్తిగత డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో తన KA 04 MX 1000 నంబర్ గల ఫార్చూనర్ వాహనం అపహరణకు గురైందని బాధితుడి తెలిపాడు. బాధితులు హోటల్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేసిన స్పందించే లేదు. వాహనంలో విలువైన పత్రాలు , డాక్యుమెంట్లు , బెంజ్ కారు తాళాలు , 3 లక్షల నగదు ఉన్నట్లు బాధితులు చెప్తున్నారు. దీనిపై స్థానిక బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వాహనం చోరీకి గురై వారం రోజులుగా గడుస్తున్నా ఆచూకీ లభించలేదు.
ఇదిలావుంటే, గతంలో ఈవెంట్స్ పేరిట ఇదే హోటల్‌లో పార్టీలు నిర్వహించారు. ఆ సందర్భంలో రైడ్ చేసి పట్టుకున్న పోలీసులు హోటల్ లో జరుగుతున్న దొంగతనాలపై విచారణ వేగవంతం చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. పైగా హోటల్ సిబ్బంది వాహనాలకు సంబంధించిన బాధ్యత అద్దెకు దిగిన వారిదేనని అంటున్నారు.
అడుగున పటిష్టమైన నిఘా నగరంలో మూడు లక్షల సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు పోలీసులు. ఖరీదైన హోటళ్లలో జరుగుతున్న దొంగతనాలపై సరిగా స్పందించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతపెద్ద హోటల్ ల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పాటు చోరీ జరిగి వారం గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడి సిబ్బంది పోలీసులకు సీసీ కెమెరాల విజువల్స్ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
కాగా సాధారణ వ్యక్తులు ఎవరు పెద్ద హోటళ్లలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. ఈవెంట్స్ నిర్వహించే వ్యక్తులు , ఆయా సిబ్బంది , ప్రముఖులు లోపలికి వెళ్లే సమయంలో ఎంట్రన్స్‌లోనే క్షుణ్ణంగా వాహనాలను పరిశీలించిన తరువాతనే లోపలికి అనుమతిస్తారు. ఎంట్రీలోనే అంత పకడ్బందీగా ఉన్నటువంటి నిఘా.. హోటల్ లో లోపల పార్క్ చేసిన వాహనాలు ఎలా మాయం అవుతున్నాయన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పార్క్ హయత్ లో ఘటనపై స్పందించేందుకు బంజారాహిల్స్ పోలీసులు నిరాకరించారు.
Read Also… బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి నాలుగేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు..