బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి నాలుగేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు..

ఇద్దరు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఎల్ బీ నగర్ కోర్టు. హైదరాబాద్‏లోని శంకర్‌పల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల ఎస్ రాజు 2016లో

బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి నాలుగేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసిన జిల్లా కోర్టు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 06, 2021 | 8:21 PM

ఇద్దరు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఎల్ బీ నగర్ కోర్టు. హైదరాబాద్‏లోని శంకర్‌పల్లి మండలానికి చెందిన 45 ఏళ్ల ఎస్ రాజు 2016లో ఇద్దరు మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. గుడికి వెళ్లి వస్తున్న ఆ ఇద్దరిని మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి.. లైంగిక దాడికి యత్నించాడు. బాధిత చిన్నారుల్లో ఒక అమ్మాయి జరిగిన సంఘటనతో తీవ్ర భయాందోలనకు గురైంది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లాకోర్టు రాజును దోషిగా తేల్చింది. దీంతో అతనికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది ఎల్‌బీనగర్ కోర్టు.

Also Read:

మన్‌ఖుర్ద్ ప్రాంతంలో అదుపులోకి రాని మంటలు.. 19 ఫైర్ఇంజన్లతో కష్టపడుతున్న అగ్నిమాపక సిబ్బంది.. వీడియో