Hyderabad: నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడు.. వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడు!

టెక్నాలజీ యుగంలోనూ కొందరు మనుషుల ఆలోచనా విధానం మారడంలేదు. ప్రేమ పేరుతో ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. విద్యావంతులైన వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ..

Hyderabad: నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడు.. వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడు!
Love Harassment

Updated on: Oct 30, 2022 | 9:23 AM

టెక్నాలజీ యుగంలోనూ కొందరు మనుషుల ఆలోచనా విధానం మారడంలేదు. ప్రేమ పేరుతో ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. విద్యావంతులైన వారు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాజాగా ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు ఓ యువకుడు. నువ్వే జీవితమన్నాడు. నువ్వు లేకపోతే బతకలేనని ప్రాధేయపడ్డాడు. పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి యువతి ససేమిరా చెప్పింది. అయినా అతను పట్టవదలకపోవడంతో యువతి ప్రేమించింది. తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు ఏకంగా అతడి నుంచి విముక్తి కావాలంటూ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన ఓ 26 ఏళ్ల యువతి, నిఖిల్‌ అనే 26 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి సాక్షిగా గతేడాది నవంబరులో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇరువురు మూడు నెలల పాటు విడిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త కాపురం మొదలు పెట్టారు.

యువతి ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండగా నిఖిల్‌ మాత్రం పనీపాట చేయకపోగా మద్యానికి బానిసయ్యాడు. అంతటితో ఆగకుండా భార్యను వేధించడం ప్రారంభించాడు. నిత్యం డబ్బులు కావాలంటూ ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె నుంచి 4 లక్షల వరకూ డబ్బు తీసుకుని స్వాహా చేశాడు. ఇక తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో తనలోని మరోకోణాన్ని బయట పెట్టాడు.

భార్యతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు వీడియోలు చూపించి, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పెడతానుంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. దాంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో ఎస్సార్‌ నగర్‌ పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us