Hyderabad: ఆహార ప్రియులకు రంజాన్‌వేళ బంపరాఫర్.. నాన్‌వెజ్ ప్రియులకు పిస్తా హౌస్ బంపర్ ఆఫర్
Hyderabad: పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. ముస్లిం (Muslims) సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రోజా ఉపవాస దీక్షలు ఎంతో నియమ నిష్టలతో చేస్తారు. అయితే ఈ రంజాన్( Ramadan ) మాసంలో..
Hyderabad: పవిత్ర రంజాన్ మాసం కొనసాగుతోంది. ముస్లిం (Muslims) సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రోజా ఉపవాస దీక్షలు ఎంతో నియమ నిష్టలతో చేస్తారు. అయితే ఈ రంజాన్( Ramadan ) మాసంలో ఉదయం వేళ ముస్లిం సోదరులు చేసే శెహరీ వంటకాలకు పెట్టింది పేరు పిస్తాహౌస్. 15 రకాల నాన్‌వెజ్ అన్‌లిమిటెడ్ భోజనం నాన్‌వెజ్ ప్రియులను రారమ్మని పిలుస్తుంటుంది. కేవలం 390 రూపాయలతో 15 రకాల మటన్ కర్రీస్ ఇక్కడ అందుబాటులో ఉండటం విశేషం. దాంతో నాన్‌వెజ్ ప్రియులు అర్ధరాత్రి 2 గంటల నుంచే పిస్తాహౌస్ ముందు క్యూ కడుతున్నారు.
ఒక్క పాతబస్తీ నుంచే కాదు.. హైదరాబాద్-సికింద్రాబాద్, శివారు ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో భోజన ప్రియులు పిస్తాహౌస్‌కి తరలిస్తారు. ఇక రంజాన్ మాసంలో ఈ రద్దీ మరింత పెరిగిపోయింది. పిస్తాహౌస్‌లో రుచికరమైన భోజనం తినడానికి జాగా కూడా దొరకదంటే అతిసయోక్తి కాదు. కస్టమర్లు గంటలు తరబడి ఈ రుచికరమైన ఆహారం కోసం వెయిట్ చేయాల్సిందే.
ఒక్కసారి ఈ పిస్తాహౌస్‌లో మటన్‌తో చేసిన వంటకాలు టేస్ట్‌చేస్తే…మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. వాటిలో మటన్ కీమ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, లివర్‌ఫ్రై, బోటి ఫ్రై, బొక్కల సూఫ్, కట్టీదాల్ ఇలా 15 రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరకే మటన్‌లోని అన్ని రకాల కర్రీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రంజాన్ కావడంతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంచారు పిస్తాహౌస్ యాజమాని. సంపాదన ముఖ్యం కాదు…సేవకోసమే రంజాన్‌లో ఈ ఆఫర్ పెట్టామన్నారు.
Also Read: Chocolate: చాక్లెట్ కోసం నదినే ఈది.. సరిహద్దు దాటి భారత్ లోకి వచ్చిన బాలుడు… 15 రోజులు రిమాండ్