TS Govt Jobs 2022: ఈ నెలఖరులోగా తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు షురూ! పూర్తి వివరాలు..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గమనిక.. ఈ నెలాఖరులో లేదా మే నెల మొదటి వారంలో ఒకటి, రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు..

TS Govt Jobs 2022: ఈ నెలఖరులోగా తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు షురూ! పూర్తి వివరాలు..
Telangana Jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2022 | 4:53 PM

Upcoming job notifications in Telangana 2022: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గమనిక.. ఈ నెలాఖరులో లేదా మే నెల మొదటి వారంలో ఒకటి, రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దాదాపు 34 వేల ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పూర్తవుతుందని అంచానా.

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు రెండు దఫాలుగా 503 గ్రూప్‌ 1 ఉద్యోగాలతోపాటు (TS Group 1 jobs), ఇతర ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. దాదాపు 30 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. అనంతరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి గానూ టీఎస్పీఎస్సీ (TSPSC)తో సహా పలు ఉద్యోగ నియామక సంస్థలు కసరత్తులు చేస్తున్నాయి. మొత్తం ఉద్యోగ ఖాళీలున్న 19 శాఖల నుంచి అవసరమైన వివరాలు సేకరించింది. ఐతే నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉండరాదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని10 ఏళ్లకు పెంచింది. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్ధుల అభ్యర్ధన మేరకు యూనిపాం సర్వీసులకు కూడా 3 ఏళ్లపాటు వయోపరిమితిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసంది. భర్తీకానున్న ఉద్యోగాలకు సంబంధించి సర్వీసు నిబంధనలు, ఎక్సైజ్‌ శాఖ పోస్టులకు ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు, ఇతర పోస్టులకు కూడా కొన్ని ముఖ్య మార్పులున్నాయని, ఇవి సరిచేయకపోతే భవిష్యత్తుల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందుకు కొంత సమయం పడుతుందని, కసరత్తు అనంతరం కమిషన్‌ పరిశీలకు పంపవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యితే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని సమాచారం.

అటు కొత్త జోనుల ప్రకారం ఒటీఆర్‌లో సవరనలకు కమిషన్‌ అవకాశం ఉచ్చింది. స్థానిక నిర్ధరణ కోసం ఓటీఆర్‌లో సవరణ చేసుకునేందుకు అభ్యర్ధులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 20 లక్షలకు పైగా అభ్యర్ధులకు గానూ సవరణలకు చేసుకున్నవారి సంఖ్య ఇప్పటివరకు లక్షన్నరలోపు ఉన్నట్లు సమాచారం. ఓటీఆర్‌లో 1 నుంచి 7 వ తరగతి వరకు చదివిన పాఠశాల, ఇతర వివరాలను నమోదు చేయవల్సి ఉంటుంది. దీని ఆధారంగా అభ్యర్ధి స్థానికతను నిర్ధారిస్తారు. లేదంటే ఉద్యోగ నియామక సమయంలో సమస్యలు తప్పవు.

Also Read:

TSPSC Groups Notification 2022: గ్రూపు 2, 3 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ.. మొత్తం 1955 ఉద్యోగాల భర్తీకి ..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు