Chicken Biryani: రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నారు.

Chicken Biryani: రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..
సాధారణంగా బిర్యానీని రుచికరంగా చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ బిర్యానీ గురించి తరచుగా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. బిర్యానీ లాంటి ఆహారం లేదని మాంసాహారులు అంటుంటారు. నాన్‌ వెజ్ బిర్యానీ కాదు.. వెజ్ బిర్యానీ బ్రంహ్మండంగా ఉంటుందని శాఖాహారులు అంటుంటారు. బిర్యానీలో వెజ్, నాన్ వెజ్ రెండూ రుచికి అమోఘంగా ఉంటాయి.

Updated on: Sep 10, 2025 | 7:37 AM

బీర్యానీ అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. అయితే.. బిర్యానీతో సొమ్ముచేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేశాయి.. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడంతో కంగారుపడ్డారు. ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది.. కొంతమంది స్నేహితులు.. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వెయిటర్ తెచ్చి ఇవ్వగానే.. తినడం ప్రారంభించారు.. ఇంతలోనే బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది.. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటి అని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. పోలీసులను పిలుపించి తమనే బయటకి వెళ్లమంటున్నారని కస్టమర్లు మండిపడ్డారు.

దీంతో కస్టమర్లు రెస్టారెంట్ ముందు ఆందోళన చేయగా.. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్ది చెప్పి పంపించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..