Rain alert: భారీ వర్షాలు.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్‌ హెమ్‌ ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసుల సూచన!

మంగళవారం హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మంగళవారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు.

Rain alert: భారీ వర్షాలు.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్‌ హెమ్‌ ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసుల సూచన!
Hyderabad

Updated on: Aug 13, 2025 | 6:24 PM

హైదరాబాద్‌లో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లే.. చిన్న వర్షం కురిసినా హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలన్ని చెరువలను తలిపిస్తాయి. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే వర్షం కురిస్తే కిలోమీటర్ల కొద్ది వాహనాలు నెమ్మదిగా కదుతూ ఉంటాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌లోనే వాహనదారులు వేచి ఉండాల్సి వస్తుంది. అయితే మంగళవారం హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ పరిధిలోని ఐటీ కంపెనీలుకు పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మంగళవారం రోజు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్దతిని అమలు చేయాలని సూచించారు. ఇందుకు ఐటీ కంపెనీ యజమానులు సహకరించాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీసులు ఎక్స్‌ వేదికగా ఒక పోస్ట్ చేశారు.

అంతేకాకుండా నగరంలోని వాహనదారులకు కూడా పోలీసులు కొన్ని సూచనలు చేశారు. సైబరాబాద్‌ ప్రాంతంలో వర్షపాతం కారణంగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడే అవకాశం ఉందని.. కాబట్టి సాయంత్రం వేళల్లో ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తమకు ఉన్న ఇతర ప్రత్యేక మార్గాలను ఎంచుకోవడం వల్ల ఇబ్బందులు పడకుండా తమ ప్రయాణాన్ని సాగించవచ్చని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.