Hyderabad: ఎంత తాగావ్ అన్న.. అతని రీడింగ్ చూసి పోలీసులకే మతి పోయింది..

21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఎక్కువగా కొత్త సంవత్సర వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ పరిధిలో 41 నుంచి 50 ఏళ్ల మధ్యగలవారిపై 109 కేసులు నమోదవగా, 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు 30 మంది, 61 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారు 30 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చిక్కినట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad: ఎంత తాగావ్ అన్న.. అతని రీడింగ్ చూసి పోలీసులకే మతి పోయింది..
Drunk And Drive Test
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2025 | 2:29 PM

మందుబాబులా? మజాకా? కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయంలో తీరు మారలేదు. మందు కొట్టి రోడ్డు మీదకు రావద్దని ఎంత చెప్పినా వినలేదు. వెహికిల్‌తో రోడ్డెక్కిన కొందరికి మీటర్‌ పెడితే రీడింగ్ సెంచరీలు కొట్టింది. పోలీసు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో ఏకంగా 1406 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి.  రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరు మైనర్లు పట్టుబడ్డారు. ఈ ఇద్దరు మైనర్లను మహేశ్వరం పరిధిలో పట్టుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. పట్టుబడినవారిలో 21 నుంచి 30 ఏళ్ల వయసున్నవారు 262 మంది ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన వాటిలో 526 టూవీలర్లు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

నాంపల్లిలో కొందరు ఆటోవాలాలు హంగామా సృష్టించారు. ఫుల్‌గా తాగి రోడ్లపై హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని భయబ్రాంతులకు గురిచేశారు. బహదూర్‌పురాలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. తన బైక్‌ ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మీర్‌చౌక్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మందు తాగి దొరికిన వారి వాహనాలు సీజ్ చేశారు. కొందరు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడ్డారు.  హయత్‌నగర్‌లో జరిగిన న్యూఇయర్‌ వేడుకల్లో రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు యువకులు.

ఓ వ్యక్తికి…550 mg/100ml రీడింగ్…. 

నగర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. మద్యం సేవించి రోడ్డెక్కిన మందుబాబులు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌కు నిరాకరించిన ఓ మందుబాబు పరుగుల తీశాడు. అతన్ని పట్టుకునేందుకు వెంటపడ్డారు. కాగా బ్రీత్‌నలైజర్ టెస్టులో ఓ వ్యక్తి రీడిండ్ చూసి పోలీసులు స్టన్ అయ్యారు. అతని రీడింగ్..  550 mg/100ml గా వచ్చింది. దీన్ని బట్టి ఆ మందుబాబు ఎంత తాగాడో అర్థం చేసుకోవచ్చు.

గత రాత్రి 10.50 గంటల సమయంలో వెంగళరావు పార్కు సమీపంలో టీఎస్ 09ఈకే 3617 నంబర్ ప్లేట్ ఉన్న బైక్‌ను నడుపుతున్న వ్యక్తిని ఆపారు. అతనికి టెస్ట్ చేయగా..550 mg/100ml గా తేలింది.  పోలీసులు అతని బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. దీంతో అతనిపై నెట్టింట ఓ రేంజ్‌లో మీమ్స్ పేలుతున్నాయి..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి