Hero Nikhil: ఓ రోగికి అత్య‌వ‌స‌ర మెడిసిన్ అందించేంద‌కు రోడ్డుపైకి హీరో నిఖిల్.. అడ్డుకున్న పోలీసులు.. చివ‌ర‌కు

హీరో నిఖిల్ ఈ మ‌ధ్యకాలంలో చాలామందికి అత్య‌వ‌స‌ర మెడిసిన్ అంద‌జేసి త‌న మంచి మ‌నషు చాటుకున్నారు. తన‌కు సాధ్య‌మైనంతలో అత‌డు ప్రాణాలు నిల‌బెట్టేందుకు...

Hero Nikhil: ఓ రోగికి అత్య‌వ‌స‌ర మెడిసిన్ అందించేంద‌కు రోడ్డుపైకి హీరో నిఖిల్.. అడ్డుకున్న పోలీసులు.. చివ‌ర‌కు
Hero Nikhil
Follow us
Ram Naramaneni

|

Updated on: May 23, 2021 | 4:32 PM

హీరో నిఖిల్ ఈ మ‌ధ్యకాలంలో చాలామందికి అత్య‌వ‌స‌ర మెడిసిన్ అంద‌జేసి త‌న మంచి మ‌నషు చాటుకున్నారు. తన‌కు సాధ్య‌మైనంతలో అత‌డు ప్రాణాలు నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే ఆదివారం లాక్‌ డౌన్ అమలులో ఉన్న సమయంలో నిఖిల్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ కోసం అత్యవసరంగా మందులు ఇవ్వడానికి రోడ్డుపైకి రావ‌డంతో పోలీసులు అడ్డుకున్నారు. మందుల ప్రిస్క్రిప్షన్, పేషెంట్ వివరాలు చూపించినా పోలీసులు అత‌డిని ముంద‌కు వెళ్ల‌నివ్వ‌లేదు. ఈ పాస్ లేకుంటే తాము ఏం చెయ్య‌లేమ‌ని చెప్పారు. దీంతో నిఖిల్ ఆవేద‌న‌తో ట్వీట్ వేశారు.

‘ఓ పేషెంట్ కోసం ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ అందించేందుకు కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్తుండగా ఉప్పల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పేషెంట్ వివరాలు, ప్రిస్ర్కిప్షన్ చూపించినా వ‌దిలిపెట్ట‌లేదు. ఈ-పాస్ తీసుకోవాల్సిందేనని చెప్పారు. 9 సార్లు ట్రై చేశాను. కానీ ఆ సైట్ స‌ర్వ‌ర్ ప‌నిచేయ‌లేదు. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీకి అనుమతి ఉంది కదా?’’ అని హీరో నిఖిల్ ఆదివారం మధ్యాహ్నం 12.12కు ట్వీట్ చేశారు.

అయితే, నిఖిల్ చేసిన ట్వీట్‌పై అర గంటకు హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్‌లో రెస్పాండ్ అయ్యారు. ‘‘సార్.. మీ లొకేషన్ షేర్ చేయండి. మేం ద‌గ్గ‌ర్లోని సిబ్బందికి సమాచారం ఇస్తాం. మీ సమస్య తీరుతుంది’’ అని బదులిచ్చారు.

కాగా పోలీసుల తీరుపై ప‌లువురు నెటిజ‌న్లు విమ‌ర్శలు చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందని, అయినా అలాంటి స‌మ‌యంలో మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రించాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read: వ్యాక్సిన్ తీసుకున్న త‌ల్లులు.. పిల్ల‌ల‌కు ఎప్ప‌టి నుంచి పాలివ్వొచ్చు..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం..

ఆనందయ్యది ఆయుర్వేదమా? నాటు మందా?.. ఆయుష్ కమిషనర్ క్లారిటీ