Hyderabad Accident: అతివేగంతో డ్రైవింగ్ చేస్తే ఇంతే.. సీసీటీవీ దృశ్యాలు షాకింగ్..
రోడ్లపై అతివేగంతో దూసుకెళ్తూ ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హైస్పీడ్ డ్రైవింగ్ కారణంగా...
రోడ్లపై అతివేగంతో దూసుకెళ్తూ ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో హైస్పీడ్ డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంగ్ రూట్‌లో అతివేగంగా వచ్చిన ఓ కారు.. అవతలి రోడ్డులో స్ట్రైట్‌గా వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో కార్లలోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా జరిగే నష్టాలను వివరిస్తూ సైబరాబాద్ పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించండి. ఇంటి వద్ద మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారు. ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా జీవితాలు నాశనం అవ్వొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
Also Read: కోవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు…! ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం