Hyderabad Police Job Connect: ఓవైపు శాంతిభ్రదతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజసేవ కోసం కృషి చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు ప్రజల్లో ట్రాఫిక్‌పై, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు (శనివారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
శనివారం నగరంలోని అమ్‌వర్లుల్ ఉలుమ్ కాలేజీ, మల్లెపల్లిలో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాను హబీబ్ నగర్ పోలీసులు చేపడుతున్నారు. ఈ జాబ్ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా సుమారు 2000లకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ అర్హత ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యుమే తీసుకురావాలని తెలిపారు. ఇక పూర్తి వివరాలకు 8333900131, 9490157542 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇక ఈ జాబ్ మేళాకు హాజరయ్యే వారు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు.
Also Read: Social Media: సోషల్ మీడియా సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ప్రతిపాదనలు సిద్ధం.. త్వరలోనే..