Hyderabad: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక పురోగతి.. సీసీ ఫుటేజ్‌లో..

కూకట్‌పల్లిలో మైనర్‌ బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికను అతి కిరాతంగా హత్య చేసిన ఘటనలో నిందితుడి అనవాళ్లను పోలీసులు కనిపెట్టారు. బాలికను హత్య చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి నిందితుడు బయటకు వస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Hyderabad: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక పురోగతి.. సీసీ ఫుటేజ్‌లో..
Crime

Updated on: Aug 18, 2025 | 10:28 PM

కూకట్‌పల్లిలో మైనర్‌ బాలిక హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మైనర్‌ బాలికను అతి కిరాతంగా హత్య చేసిన ఘటనలో నిందితుడి అనవాళ్లను పోలీసులు కనిపెట్టారు. బాలికను హత్య చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి నిందితుడు బయటకు వస్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అయితే, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన నిందితుడు.. బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని.. ఆ సమయంలో తప్పించుకునేందుకు బాలిక ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సోమవారం కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను టార్గెట్‌కుగా చేసుకున్న నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  వెంటనే ఘటనా స్థానికి చేరుకున్న పోలీసులు  డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. స్థానికంగా ఉన్న  సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల్ని
గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.