Telangana News: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‎ చేసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోకుంటే జైలుకే..!

| Edited By: Velpula Bharath Rao

Dec 13, 2024 | 6:44 AM

న్యూ ఇయర్ పార్టీని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా పెద్దఎత్తున ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

Telangana News: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‎ చేసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోకుంటే జైలుకే..!
New Year Celebrations
Follow us on

కొత్త ఏడాది వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి రానున్న కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ రెడీ అవుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి న్యూ ఇయర్ పార్టీకి మీరూ సిద్ధమవుతూనే ఉంటారుగా.. న్యూ ఇయర్ పార్టీని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలా పెద్దఎత్తున ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ రూల్స్ తప్పకుండా తెలుసుకోవాల్సిందే. న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్ నిర్వాహకులకు తాజాగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అవేంటో చూద్దాం ఇప్పుడు..

న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్ జరిగే ప్లేసెస్‌లలో ప్రతి వెన్యూ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు.. పార్కింగ్ ప్లేస్‌ల్లోనూ సీసీ కెమెరాలు ఉండాల్సిందే అని పోలీసులు చెబుతున్నారు. పార్టీ జరిగే దగ్గర ఎలాంటి అశ్లీలమైన కార్యకలాపాలకు పాల్పడకూడదు. అంటే శృతి మించేలా పబ్లిక్ ప్లేస్‌ల్లో రొమాన్స్ లాంటి వాటి జోలికి వెళ్లకూడదు. మీరు బహిరంగంగా ఎక్కడైనా పార్టీ నిర్వహించనట్లయితే 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టములు లాంటివి అసలే పెట్టరాదు. శాంతిభద్రలకు భంగం కలిగించరాదు. పార్టీకి వచ్చే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు గానీ ఉండరాదు. మీరు నిర్వహించే పార్టీల వల్ల ముఖ్యంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా నిర్వాహకులదే.

ఇలాంటి న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువగా పబ్బులు, బార్లలో నిర్వహించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రదేశాల్లో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వకూడదు. పార్టీలలో డ్రగ్స్ వినియోగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పార్టీకి తీసుకొచ్చే వాహనాల కోసం పార్కింగ్ ప్లేస్‌లపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్టీ ముగిశాక మద్యం సేవించినవారిని స్వతహాగా పంపించకుండా వారికి సహాయంగా ఖచ్చితంగా నిర్వాహకులు డ్రైవర్లను ఏర్పాటు చేయాలి. అలా కాదు అని మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ సూచిస్తోంది.ఒకవేళ మద్యం తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. మైనర్లు బండి నడిపి యాక్సిడెంట్‌లకు పాల్పడితే మాత్రం మైనర్‌తో పాటు ఓనర్‌పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్‌లకు పాల్పడితే మోటర్ వెహికల్ యాక్ట్ శిక్షార్హులు అని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించే ప్రతి చోట షీ టీమ్స్‌ని తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి