Hyderabad: అమ్మాయి అందంగా ఉందని మోసపోకు మిత్రమా.. ఆమె వీడియోలకు లైక్ కొట్టారంటే ఇక మీ పని గోవిందా..

|

Dec 18, 2022 | 12:22 PM

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది. ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది.

Hyderabad: అమ్మాయి అందంగా ఉందని మోసపోకు మిత్రమా.. ఆమె వీడియోలకు లైక్ కొట్టారంటే ఇక మీ పని గోవిందా..
Hyderabad Crime
Follow us on

అందంగా లేనా.. అసలేం బాలేనా అంటూ ఓ యువతి భారీ మోసానికి తెరలేపింది. ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ఈ క్రమంలో ఎవరైనా అబ్బాయిలు లైక్ కొడితే.. వారి నుంచి సర్వం దోచేయడం మొదలు పెట్టింది. ఈ కీలాడీ లేడీ, ఆమె ప్రియుడు మోసానికి ఎందరో బాధితులుగా మిగిలారు.. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు ఓ యువతి మోసాల బాటపట్టగా.. ఆమెకు ఓ యువకుడు సహకరించాడు. దీంతో ఆమె తన అందం.. అభినయంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకుంది.  అలా కొందరిని టార్గెట్ చేసి.. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి భారీగా డబ్బు వసూలు చేసేది. హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం పట్టణానికి చెందిన పరసా తనుశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లను వేలమంది ఫాలో అవ్వుతున్నారు.. ఆమె చేసే వీడియోలకు కొందరు లైక్ చేయడంతోపాటు కామెంట్లు చేసేవారు.

అయితే తేలిగ్గా డబ్బు సంపాదించేయాలనే పిచ్చి ఆలోచనతో తనుశ్రీ.. పరసా శ్రీకాంత్ తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. ఇలా Instagram, facebook అందమైన ఫొటోస్, వీడియోలు పెట్టి.. లైకులు కొట్టిన వారిని తనుశ్రీ ట్రాప్ చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో యువకులను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తుండేంది. ఆమె వీడియోల కింద కామెంట్లు పెట్టేవారికి తిరిగి పర్సనల్‌గా మెసేజ్‌లు పంపించేది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి డబ్బు వసూలు చేసేది.

ఇలా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం బాగోలేదంటూ 8 నెలల్లో 31లక్షల 66వేలు వసూలు చేసింది. ఆమెది మోసమని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

కృష్ణాజిల్లా చెందిన పరాస తనుశ్రీని, ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వీరిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లోని చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..