తెలుగు రాష్ట్రాల్లో మరో విద్యాకుసుమం రాలింది. ప్రీతి, రక్షిత ఆత్మహత్య ఘటనలు మరవకముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్. సాత్విక్ ఆత్మహత్య రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి స్టూడెంట్స్ చెబుతున్నారు. కాగా విద్యార్థి సూసైడ్ వ్యవహారంలో కాలేజీ యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాత్విక్ ఉరుసుకున్నాడని తెలిసినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. కనీసం ఆస్పత్రికి తరలించలేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. తోటి విద్యార్థులే బయట వెహికిల్ ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపే సాత్విక్ కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహన్ని ఉస్మానియాకు తరలించారు.
కాగా కాలేజ్ యాజమాన్యం నుంచి తీవ్ర ఒత్తిడి కారణంగానే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. మరోవైపు స్టూడెంట్స్‌ని హాస్టల్ నుంచి ఇమ్మిడియేట్ గా బ్యాగులు సర్దుకుని పంపించేస్తోంది కాలేజీ యాజమాన్యం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..