Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గోల్కొండలోని రిసాల్ బజార్ ప్రాంతంలో తల్లి చేతిలోనే 14 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..
Ramzan Shopping In Hyderabad

Edited By:

Updated on: Mar 16, 2026 | 12:39 PM

హైదరాబాద్ నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గోల్కొండలోని రిసాల్ బజార్ ప్రాంతంలో తల్లి చేతిలోనే 14 నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అమీర్ అలీ అనే ఆటో డ్రైవర్ తన భార్య గౌసియా బేగం (23)తో కలిసి రిసాల్ బజార్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఉమ్మె ఐమన్ అనే 14 నెలల పాప ఉంది. అయితే, దంపతుల మధ్య గత కొంతకాలంగా తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ క్రమంలోనే.. రంజాన్ పండుగ నేపథ్యంలో పండుగ దుస్తుల విషయమై భర్త-భార్యల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ గొడవ తీవ్రంగా మారడంతో కోపోద్రిక్తురాలైన గౌసియా బేగం తన 14 నెలల కుమార్తెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం సుమారు 4:00 గంటల నుండి 5:00 గంటల మధ్య జరిగినట్లు పేర్కొంటున్నారు.

ఘటన జరిగిన వెంటనే చిన్నారి తండ్రి అమీర్ అలీ, ఆమె తాత కలిసి బాలికను చికిత్స కోసం వెంటనే ఇండో-యూఎస్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడి వైద్యులు బాలికను పరీక్షించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. చిన్నారి మృతి వార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఇక ఘటన అనంతరం సుమారు సాయంత్రం 5:10 గంటల సమయంలో గౌసియా బేగం స్వయంగా గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆమె లొంగిపోవడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయితే అసలు కారణాలు ఏమిటి, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏవీ అన్న విషయాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసికందు మృతితో రిసాల్ బజార్ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us