Agnipath Protests: అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి . ఈ అగ్గి జ్వాలలు తెలంగాణ(Telangana)కు చేరుకున్నాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్(Secunderabad)లో యువకులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు చేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. అన్ని మార్గాల్లో ట్రైన్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే పలు రైళ్లతో పాటు MMTS ట్రైన్ కూడా రద్దయ్యాయి. ఫలక్‌నుమా నుంచి లింగపల్లి వెళ్లే 12ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు రదయ్యాయి. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎస్ ట్రైన్స్ నిలిచిపోయాయి. దీనివల్ల ఇవాళ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.