మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్

|

Jun 01, 2021 | 8:52 AM

hyderabad metro rail: మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి.  దీంతో  లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం12.45 వరకూ...

మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్
Hyderabad Metro Timings
Follow us on

తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి.  దీంతో  లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం12.45 వరకూ అన్ని రకాల కార్యకలాపాలకు సడలింపు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 నిమిషాలకు మొదలు కానుంది. ఈ రైలు ఉదయం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ సూచించింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి : Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

New Rules From Today: ఈ రోజు నుంచి చాలా మారిపోతున్నాయి..! గమనించారా..! అయితే మీ ఇష్టం..!