AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌.. హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్న సరికొత్త ప్రాజెక్టులు..

హైదరాబాద్ మెట్రో విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బేగంపేట, హకీంపేట విమానాశ్రయాల వద్ద అండర్ పాస్ టన్నెళ్ళ నిర్మాణం, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల విస్తరణ వంటి పెద్ద ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులు ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, నగర అభివృద్ధికి దోహదం చేస్తాయి.

Hyderabad: మెట్రో విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌.. హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్న సరికొత్త ప్రాజెక్టులు..
Cm Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 8:42 AM

Share

హైదరాబాద్ మహా నగరంలో మెట్రో విస్తరణకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. మరో వైపు ఇంటర్నల్‌.. ఔటర్‌ రింగ్‌ రోడ్లు, ఎలివేటేడ్‌ కారిడార్స్‌.. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో సరికొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఆ కోవలో ఇప్పుడు మరిన్ని బిగ్‌ ప్రాజెక్ట్స్‌ను టేకప్‌ చేసింది HMDA. బేగంపేట, హకీంపేట డిఫెన్స్ ఎయిర్‌పోర్టుల్లో అండర్‌ పాస్‌ టన్నెల్స్‌ ప్రణాళికలు సిద్దం…

మార్పు నినాదంతో పవర్‌లోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌.. ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంలో తన మార్క్‌ చాటుకుంటోంది. ఇటీవలే కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్ పాస్ ఫ్లై ఓవర్లు, కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇక హైదరాబాద్‌కు తెలంగాణ జిల్లాలకు రోడ్‌ కనెక్టివిటీని పెంచేలా ఇప్పటికే SH1 రాజీవ్‌ రహదారి, NH44పై ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం జరుగుతోంది.

ఐతే ఆ రెండు హైవేలపై నిర్మిస్తోన్న ఎలివేటెడ్‌ కారిడార్ల వల్ల బేగంపేట, హకీంపేట ఎయిర్‌ పోర్టుల నిర్వహణ సహా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం వుంది. పరిష్కారంగా మారంగా అండర్‌ టన్నెల్స్‌ నిర్మాణాలకు సిద్దమైంది హెచ్‌ఎండీఏ. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధ చేసినట్లు కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ దగ్గర దాదాపు 600 మీటర్ల పొడవున అండర్‌ టన్నల్‌ తవ్వి, ఎలివేటెడ్ కారిడార్ కు కనెక్ట్‌ చేస్తారు. ఈ ప్రాజెక్టుకు వ్యయం అంచనా 1580 కోట్లు. ఈ మొత్తం ఎలివేటర్ కారిడార్‌ కోసం దాదాపు 73 ఎకరాలు అవసరం. అందులో ఇప్పటికే 55.85 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్, 8.41 ఎకర్స్ ప్రైవేట్ ల్యాండ్ ను కేటాయించారు.

ఇక రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు కనెక్ట్‌ చేస్తూ హకీంపేట డిఫెన్స్ ఏయిర్‌పోర్ట్‌లో అండర్‌ టన్నల్‌ పాసింగ్‌కు ప్రణాళికలు చేసింది HMDA. దాదాపు 400 మీటర్ల పొడవున నిర్మించే అండర్ టర్నల్ ప్రాజెక్ట్‌ వ్యయ అంచనా 2232 కోట్లు. కావాల్సిన భూమి 197 ఎకరాలు. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్‌ ల్యాండ్‌.. మరో 83 ఎకరాలు ప్రయివేట్‌ ల్యాండ్‌ అవసరమని నిర్ణయించారు.ఈ ఎలివేటెడ్ కారిడార్ కరీంనగర్ కు వెళ్లే హైవేకు కనెక్టివిటీ కానుంది.

అదీ సంగతి. దూరం-బారం తగ్గిస్తూ ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేయడం సహా అభివృద్ధికి వారధిగా సరికొత్త ప్రాజెక్టులు హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..