AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Police: పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. ధర్నా చేసిన 39 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్

తెలంగాణ పోలీస్ శాఖ 39 మంది కానిస్టేబుళ్లను ధర్నాలో పాల్గొన్నందుకు సస్పెండ్ చేసింది. అధిక పనిభారం, తగినంత సెలవులు లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆందోళన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. పోలీసుల భార్యలు కూడా ఇటీవల సెలవుల అంశంపై ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన తెలంగాణలో వివాదాస్పదంగా మారింది.

Telangana Police: పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. ధర్నా చేసిన 39 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్
Telangana Police
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2024 | 7:19 AM

Share

ఇన్నాళ్లు సమాజంలో ప్రజలు, ఇతర వర్గాలు ధర్నాలు చేస్తే, ఇప్పుడు పోలీసులు, వారి కుటుంబాలే నిరసనకు దిగుతుండటం సంచలనంగా మారింది.. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహించారు. సంబంధం లేని పనులు చేయిస్తున్నారని.. తమిళనాడు, కర్ణాటక మాధిరి ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ పోలీసులు డిమాండ్ చేశారు. అయితే.. బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారు, ఇష్టానుసారంగా టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న వారిని గుర్తించింది పోలీసు శాఖ. ఆందోళనలను ప్రేరేపిస్తూ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న కొందరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది.

ఆర్టికల్ 311 ప్రకారం వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఆందోళనలను ప్రేరేపిస్తున్న 39 మందిని పోలీస్‌శాఖ సస్పెండ్ చేసింది. తెలంగాణలోని 3, 4, 5, 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెన్షన్ చేస్తూ తెలంగాణ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

కాగా.. ఈ మధ్య కాలంలో పోలీసుల భార్యలు ఆందోళన చేపట్టడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదంటూ భార్యలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం స్పందించి దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించింది.. ఈ క్రమంలోనే.. స్వయంగా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ధర్నాకు దిగడంతో డిపార్ట్‌మెంట్ చర్యలకు ఉపక్రమించింది. అయితే, కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని ప్రభుత్వం అనుమానం వ్యక్తంచేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..