Hyderabad: ఓర్ని ఇదెక్కడి యవ్వారం.. పోలీసుల దగ్గరే మామూళ్లు వసూలు చేసే ప్రయత్నం.. కట్‌చేస్తే.. ఇదీ పరిస్థితి..
హైదరాబాద్ పాతబస్తీలో మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. షాడో పోలీస్‌నంటూ పోలీసుల దగ్గరే మామూళ్లు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు ఓ హోంగార్డ్. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఓ హోంగార్డు మోసం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు.

హైదరాబాద్ పాతబస్తీలో మరో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. షాడో పోలీస్‌నంటూ పోలీసుల దగ్గరే మామూళ్లు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు ఓ హోంగార్డ్. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఓ హోంగార్డు మోసం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. హోమ్‌గార్డు ఫరీద్ సివిల్ డ్రెస్‌లో ప్రైవేట్ వాహనంపై రాత్రివేళ పోలీసులు నిర్వహిస్తున్న పహారా వద్దకు చేరుకుని తాను షాడో టీంలో ఉన్న అధికారి నంటూ డబ్బులు వసూలు చేసేందుకు యత్నించాడు. పోలీసులను బెదిరించడమే కాకుండా, వారి పనితీరును పర్యవేక్షిస్తున్నట్టు నటిస్తూ వీడియోలు తీస్తూ వేధించడం ప్రారంభించాడు.
కమిషనర్ ఆదేశాలతో రూపొందించిన షాడో టీంలు సాధారణంగా నగరంలోని అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు, క్రమశిక్షణా చర్యలను గమనించేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. అలాంటి టీంలో తాను ఉన్నానంటూ చెప్పడం, అదే సమయంలో పోలీసుల పట్ల వైఖరి విచిత్రంగా ఉండడంతో పెట్రోలింగ్ బృందంలో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతనిపై వీడియో తీసి, వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతలోనే అతను అక్కడి నుంచి ఒక్కసారిగా పారిపోయాడు.
హోంగార్డు వచ్చిన బండి నెంబర్ ప్లేట్ కూడా సరైన ఫార్మాట్‌లో లేకపోవడం వల్ల పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో పెట్రోలింగ్ సిబ్బంది బండ్లగూడ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను హోంగార్డుగా పనిచేస్తున్న వ్యవహారాన్ని, అతడి విధుల్లో ఉన్న స్థితిని పరిశీలిస్తూ, ఎవరి అనుమతితో షాడో టీం పేరును వాడుతున్నాడో అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇలాంటి చర్యలు పోలీస్ వ్యవస్థను అపహాస్యం చేస్తాయని, అధికారిక గుర్తింపును ఉపయోగించుకుని ఇలా మోసం చేయడాన్ని పెద్ద నేరంగా పరిగణించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ శాఖ కూడా ఇలాంటి వాటిపై కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నకిలీ అధికారులుగా నటిస్తూ పోలీసులు లేదా పౌరులను వేధించే వ్యక్తులపై విచారణను మరింత వేగవంతం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
