AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి

కాస్ట్‌లీ కార్లతో, మితిమీరిన వేగంతో ర్యాష్‌ డ్రైవింగ్ చేస్తూ కొందరు వ్యక్తులు అమాయకుల ప్రాణాలను తీస్తున్న ఘటన హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. తాజాగా మాదాపూర్ సమీపంలోని కేబ్రుల్‌ బ్రిడ్జ్‌పై వాయువేగంతో దూసుకొచ్చిన బెంజ్‌ కారు ఓ యువకుడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Hyderabad: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
Madhapur Cable Bridge Accident
Anand T
|

Updated on: Apr 20, 2026 | 12:40 PM

Share

ఖరీదైన కార్లతో మితిమీరిన వేగంతో హైదరాబాద్‌ నగర రోడ్లపై ప్రమాదకర డ్రైవింగ్ చేస్తూ అమాయకుల మరణాలకు కారణం అవుతన్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఘటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో గోస శ్యామ్ రాజ్ అనే 32 ఏళ్ల యువకుడు కేబుల్‌ బ్రిడ్జిపై నిలబడి ఉండగా జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ మెర్సడెస్ బెంజ్ కారు అతన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రమాదాన్ని గమనించగా యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్టు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు గుర్తించారు. ఆ కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా