Hyderabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలో వరుడు ఎస్కేప్.. చివరికి ఏం జరిగిందంటే?

|

May 05, 2023 | 9:00 AM

కొంతమంది ప్రేమ కోసం తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోతుంటే.. మరికొందరు అటు తల్లిదండ్రులను వదులుకోలేక.. ఇటు ప్రేమను కాదనలేక.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

Hyderabad: మరికొన్ని గంటల్లో పెళ్లి.. అంతలో వరుడు ఎస్కేప్.. చివరికి ఏం జరిగిందంటే?
Hyderabad
Follow us on

కొంతమంది ప్రేమ కోసం తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోతుంటే.. మరికొందరు అటు తల్లిదండ్రులను వదులుకోలేక.. ఇటు ప్రేమను కాదనలేక.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటు చేసుకుంది. ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితేనేం ఇంట్లో ఒప్పించి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సాక్షిగా మరోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇంట్లో చెప్పి.. పెద్దలను ఒప్పించారు. సీన్ కట్ చేస్తే.!

వారి ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరుగుతోందని.. ఆ వధువు ఎంతగానో సంతోషపడింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మరికొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు జంప్ అయ్యాడు. ఫోన్ స్విచాఫ్.. వరుడి కోసం స్నేహితులు, తెలిసిన బంధువులను విచారించారు. అయినా కూడా ఎక్కడా అతడి ఆచూకీ లభించలేదు. ఇక చివరికి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది వధువు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఖాకీలు.. సుమారు 4 గంటల వ్యవధిలోనే వరుడు ఆచూకీ కనుగొన్నారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఇంటికి చేర్చారు. కాగా, అనుకున్న సమయానికి పెళ్లి జరగడంతో.. ఇరు కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.