Hyderabad: హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో జంటనగరాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నిరుపేద ప్రజల అవసరాలను గుర్తించి వారి కమ్యూనిటీ అవసరాల కోసం మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపట్టింది. మొత్తం రూ. 34కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 14 పనులను చేపట్టింది. బేగంపేట సర్కిల్ లో బన్సిలాల్ పేట్, బోయాగుడ పోలీస్ స్టేషన్ ప్రక్కన, నెహ్రూ నగర్ పార్క్ మారేడు పల్లి, పఠాన్ చెరువు సర్కిల్ లో చైతన్య నగర్, సికింద్రాబాద్ సర్కిల్ లో సీతాఫల్ మండి టి.ఆర్.టి క్వాటర్స్, ఎల్.బి నగర్ సర్కిల్ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద, గాంధీ నగర్ రామంతపూర్ గాంధీ నగర్ 4 ఫేస్, కె.పి.హెచ్.బీ కాలనీ గాజులరామారం మొత్తం 8 పనులు రూ. 23.73 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. మిగితా 2 పనులలో అదనపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. మిగితా 4 పనులు వివిధ దశలో ఉన్నాయి. ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్‌లో పూర్తి వసతులు కల్పించారు. ఈ ఫన్షన్ హాల్స్‌ను వివాహ వేడుకలు, ఎగ్జిబిషన్లు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు బాడుగకు ఇవ్వనున్నారు.
రూ. 46 కోట్లతో మోడల్ స్మశాన వాటికల నిర్మాణం
అలాగే సుమారు రూ. 46 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో 33 మోడల్ స్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టారు. మొదటి దశలో రూ. 24.13కోట్ల అంచనా వ్యయంతో 24 పనులు చేపట్టగా మొత్తానికి మొత్తం పూర్తయ్యాయి. స్మశాన వాటికలకు ప్రహరీగోడ ఇతర మౌలిక వసతులు అయిన వాచ్ ఏరియా, బర్నింగ్ ప్లాట్ ఫాం, ప్రేయర్ హాల్ వెయిటింగ్ ఏరియా, సిట్టింగ్ గ్యాలరీ, పార్కింగ్ స్థలం, ఆఫీస్ స్థలం, అంత్యక్రియలకు సంబందించిన ఐటమ్స్ షాప్, లైటింగ్ ఇతర అవసరమైన వసతులు కల్పించారు. రెండో దశలో రూ. 21.77 కోట్ల అంచనా వ్యయంతో 9 పనులు చేపట్టగా అందులో 3 పనులు పూర్తి కాగా మిగితా పనులు వివిధ అభివృద్ది దశలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులను నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read..
Ladies Safety: ట్రయల్ రూం ట్రబుల్స్… కెమెరా కళ్లు చూస్తున్నాయి జాగ్రత్త..
Google Pay: గూగుల్ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..