
గాంధీ హాస్పిటల్‌లో ఓ అరుదైన కేసు జరిగింది. 36 ఏళ్ల రియాజుద్దీన్ పాషా అనే వ్యక్తి వ్యక్తి మానసిక సమస్యలతో బ్లేడ్ మింగాడు. 48 గంటలు తరువాత గాంధీ హాస్పిటల్‌కు వచ్చాడు. అక్కడ అతనికి టెస్టులు చేసిన డాక్టర్లు గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్‌లో బ్లేడ్ ఉన్నట్లు నిర్ధారించారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బ్లేడ్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కానీ ఈ కేసులో డాక్టర్లు చికిత్సను చాలా జాగ్రత్తగా నిర్వహించారు. అతని కడుపు లైనింగ్ దెబ్బతినకుండా ముందుగా బాధితుడికి ఐవీ లిక్విడ్స్, మందులు ఇచ్చారు. ఆపై కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. దీంతో బ్లేడ్ నార్మల్‌గా మోషన్ గుండా బయటకు వచ్చేసింది. కోలుకున్న అనంతరం రియాజుద్దీన్‌ను డిశ్చార్జ్ చేశారు.
మాములు ఇలాంటి కేసులు డీల్ చేసేటప్పుడు ఎండోస్కోపీ పద్దతి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఇతర సంప్రదాయ విధానాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి అని డాక్టర్లు తెలిపారు.