Hyderabad: బస్సు కింద పడుకొని యువకుడి రీల్.. అసలు విషయం చెప్పిన TGRTC ఎండీ సజ్జనార్

| Edited By: Subhash Goud

Jun 22, 2024 | 5:54 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. లైక్స్, షేర్స్ మాయలో పడి.. చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఈ మధ్య ప్రాంకుల కోసం పిచ్చి వేషాలు వేస్తున్నవారిని చూస్తున్నాం. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు తరుచుగా రోజూ ఏదో మూలన వెలుగు చూస్తూనే ఉన్నాం...

Hyderabad: బస్సు కింద పడుకొని యువకుడి రీల్.. అసలు విషయం చెప్పిన TGRTC ఎండీ సజ్జనార్
Tgrtc
Follow us on

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. లైక్స్, షేర్స్ మాయలో పడి.. చట్టాలను అతిక్రమిస్తున్నారు. ఈ మధ్య ప్రాంకుల కోసం పిచ్చి వేషాలు వేస్తున్నవారిని చూస్తున్నాం. ఇన్‌స్టాలో రీల్స్ చేసేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిని చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు తరుచుగా రోజూ ఏదో మూలన వెలుగు చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మోన్న.. ఓ అమ్మాయి ఇన్ స్టా రీల్ కోసం కారు రివర్స్ చేయాలనుకుని.. ఏకంగా లోయలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా మరో యువకుడు ఉరేసుకున్నట్టు వీడియో తీయాలనుకుని ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఇలాంటి వరుస ఘటనలు యువత పిచ్చి పోకడలను తెలియజేస్తున్నాయి.

తాజాగా సిటీలోని రోడ్డుపై వేగంగా వస్తున్న RTC బస్సు ముందుకు ఓ యువకుడు అకస్మాత్తుగా వచ్చి.. ఆ బస్సు కింద పడుకుని.. ఆ బస్సు దాటిపోయాక నిదానంగా లేచి.. షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తుండగా.. దీనిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.

ఇవి కూడా చదవండి

సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న పూర్తిగా ఎడిటెడ్ వీడియో అని తేల్చేశారు. సోషల్‌ మీడియాలో ఫేమ్ కోసం ఆకతాయిలు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారంటూ ఆయన తెలిపారు. ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే అవకాశం ఉందని.. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాపాయంలో పడేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను TGSRTC యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోందని.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ వెల్లడించారు.

 


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి